ఏపీ ఉపాధి కూలీలకు శుభవార్త.. రూ. 685.12 కోట్లు విడుదల

ఏపీ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఉపాధి హామీ కూలీల చెల్లింపుల నిమిత్తం రూ.685. 12 కోట్ల నిధులు రిలీజ్‌ చేసింది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర నోడల్‌ ఖాతాల్లో ఈ ఖాతాలలో రూ.622 కోట్ల జమ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గత రెండు రోజుల్లో కూలీలకు రూ.302.96 కోట్ల మేర చెల్లింపులు చేసేసింది.

వచ్చే రెండు, మూడు రోజుల్లో మరో రూ…319 కోట్లు కూలీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్ ప్రకటన చేశారు. కాగా… కేంద్ర సర్కార్‌ నుంచి ఉపాధి హామీ పథకం కింద వస్తున్న నిధులను జగన్‌ సర్కార్‌ వేరే పథకాలకు మళ్లీ స్తోందంటూ ఇటీవలే తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ సర్కార్‌ తీరుతో కష్టపడి చేస్తున్న కూలీలకు సకాలంలో నిధులు అందడం లేదని ప్రతి పక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కూలీలకు డబ్బులు పంపిణీ చేస్తోంది.