కేసీఆర్ సర్కార్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రుణాలు తీసుకునేందుకు కేసీఆర్ సర్కార్ కు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది మోడీ సర్కార్. కొన్ని రోజులుగా అడుగుతున్నా…. తెలంగాణకు రుణాల కోసం ఇంకా అనుమతి ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం. యాబై వేల కోట్లు రుణం కోరుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
దీంతో కేంద్రం పై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే.. అవసరమైతే త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్రం నిర్ణయంతో ప్రభుత్వ పథకాలు, బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీ ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఈ నెల విడతల వారీగా 12 వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇస్తోంది కేసీఆర్ సర్కార్.