ప్రపంచవ్యాప్తంగా తెలుగుకు వెలుగులద్దిన దివిటీ ఎన్టీఆర్ : వెంకయ్యనాయుడు

-

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయణ్ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్.. సమాజంపై వారు చెరగని ముద్ర వేశారని.. తెలుగువారి ఆత్మగౌరవానికి ఆయన ప్రతీక అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుకు వెలుగులద్దిన దివిటీ ఆ తెలుగు తేజమని ప్రశంసల్లో ముంచెత్తారు. మాతృభాష, మన సంస్కృతి మన అస్తిత్వం ఎలా అవుతుందో, మన చిరునామా ఎలా అవుతుందో నిదర్శనంగా నిలిచి చూపించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రల్లో శ్రీ ఎన్టీఆర్ లీనమైన తీరు ఆయన్ను వెండి తెర ఇలవేల్పు నుంచి ఇంటింటి ఇలవేల్పుగా మార్చింది. సినిమాలను ప్రజల్లో మార్పు తెచ్చే శక్తిమంతమైన మాధ్యమంగా గుర్తించి, దాన్ని సద్వినియోగం చేసి, బలమైన పాత్రల ద్వారా ఎన్నో సామాజిక సమస్యలపై ప్రజల్లో శ్రీ ఎన్టీఆర్ అవగాహన కల్పించారు. నటుడు గానే కాదు నాయకుడిగానూ తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఎన్టీఆర్. నిరంకుశత్వానికి ధైర్యంగా ఎదురొడ్డి దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మహానేత. అని ట్వీట్లే పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news