పరిపాలనలో కనీవిని ఎరుగని స్థాయిలో సంస్కరణలు తీసుకొచ్చి జగనన్న ప్రజా పాలకుడిగా ఈ దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. చిలకలూరిపేట రూరల్ మండలం మురికిపూడిలో రూ.80 లక్షల వ్యవయంతో నిర్మించిన రెండు గ్రామ సచివాలయాలను మంత్రి విడదల రజిని గారు శుక్రవారం ప్రారంభించారు.
సుమారు రూ.44లక్షల వ్యయంతో నిర్మించిన రెండు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఊరారా సచివాలయాలు, హెల్త్ క్లినిక్‌లు, రైతు బరోసా కేంద్రాలను తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలిపారు. ఇలా ఒక నాయకుడు వందేళ్లకు ఒక్కడే వస్తాడని కొనియాడారు. జగనన్న తీసుకొచ్చిన సచివాలయాల వల్ల ప్రజలకు సత్వరమే ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల వల్ల సత్వరమే వైద్య సేవలను ప్రజలు పొందగలుగుతున్నారని వెల్లడించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.