మహిళా సాధికారత విషయంలో మన రాష్ట్రం ఈ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ద హిందూ దినపత్రిక మహిళా సమావేశాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి మంత్రి విడదల రజిని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయంగా అన్ని పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తున్న ఘనత జగనన్నదేనని చెప్పారు. నవరత్నాలు పథకాలన్నీ మహిళలకు ఆర్థిక ఊతం ఇచ్చేవే అని తెలిపారు. నిజమైన మహిళా సాధికారత జగనన్న వల్ల సాకారం అవుతుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో మహిళా కమిషనర్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ కేజీవి సరిత గారు, మార్పు ట్రస్టు డైరెక్టర్ రావూరి సూయజ్ గారు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధ్యాపకురాలు సీహెచ్ స్వరూపారాణి గారు, ఎన్ టీవీ రిపోర్టర్ రెహానా బేగమ్ గారు, హిందూ దినపత్రిక జీఎం ఎస్ డీటీ రావు గారు తదితరులు పాల్గొన్నారు.