బుర్ర పెంచుకోమని చెప్తే వినవు ! అచ్చెన్నకు రెడ్డి గారి పంచ్ 

తెలుగుదేశం పార్టీని కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ మిగతా కీలక నాయకులను కానీ, సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకోవాలి అంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి తరువాతనే ఎవరైనా. లాజిక్ తో వ్యంగ్యాస్త్రాలు  స్పందిస్తూ, ఆయన తన ట్వీట్స్ లో వెటకారం జోడిస్తూ, టిడిపి నాయకులపై చేసే విమర్శలకు జనాల్లో మంచి ఆదరణ ఉంది. ఏ విషయం పైన అయినా, టిడిపి నాయకులు తమ స్పందన తెలియ చేసిన వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేందుకు విజయసాయిరెడ్డి రెడీగా ఉంటారు.
నిత్యం ఏదో ఒక అంశంపై ట్వీట్ చేస్తూనే ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయే కౌంటర్లు ఇస్తూ, తమ సత్తా చాటుకుంటూనే వస్తున్నారు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు పైన అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెద్ద దుమారమే రేగుతోంది. ప్రభుత్వం ఈ ఎన్నికలను ప్రస్తుతం నిర్వహించ వద్దంటూ అభ్యంతరం తెలుపుతుండగా, టీడీపీతో పాటు, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది . ఈ మేరకు టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని, కానీ ప్రస్తుతం ఆ వైరస్ ప్రభావం తగ్గిపోయింది అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పై విజయ సాయి రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
 ” ఎట్టెట్టా అచ్చెన్నా .. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసిన పుడు ( మార్చిలో) కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయా ? ఇప్పుడు తగ్గిపోయాయా ? అడ్డెడ్డే ఏం అవగాహన ? ఏం నాలెడ్జ్ ? చిట్టిబాబు లోకే శం ను మించి పోతున్నావు గా, అందుకే చాలాకాలం క్రితం జగన్ గారు తమరికి సలహా ఇచ్చింది బుర్ర పెంచుకోమని. చెప్తే వినవు ? ” అంటూ పోస్ట్ పెట్టడం వైరల్ అవుతోంది.
-Surya