టీడీపీ ‘మాయా’ఫెస్టోలో ఎవరు పడతారు? : విజయసాయిరెడ్డి

-

టీడీపీ ‘మాయా’ఫెస్టోలో ఎవరు పడతారు? అంటూ చంద్రబాబు రిలీజ్‌ చేసిన మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి చురకలు అంటించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల అయింది. కాసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

2024 ఎన్నికల్లో గెలిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు చంద్రబాబు నాయుడు. అయితే.. దానికి కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. రాజమహేంద్రవరంలో టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన తొలిదశ మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘అమలు చేయమని కోరుతారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత మినీఫెస్టోనే మాయం చేసినవారు… ఇప్పుడు ఆల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ ‘మాయా’ ఫెస్టోలో ఎవరు పడతారు?’ అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news