చికోటి ఫాం హౌజ్ లో విజయ సాయిరెడ్డి..?

-

చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ కు విజయ సాయిరెడ్డి వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై విజయ సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.ఒరేయ్ ఎల్లో కుల మీడియా దొంగల్లారా! నిన్న చికోటి ఫామ్ కు వెళ్లానని ప్రచారం చేశారు కదరా! ఈరోజు ఇంకో ఫామ్ కు వెళ్లానురా! ఇది డ్రామోజీ ఆక్రమించిన 2500 ఎకరాల ఫామ్ రా! అంటూ ఫైర్ అయ్యారు సాయి రెడ్డి.

నేను చెప్పిన వాడు లేదా నాకు లొంగేవాడే సీఎంగా ఉండాలి. లేకపోతే ఎవర్నైనా సీఎం పీఠం నుంచి దించేస్తా అనే అజ్ఞానం, అహంకారం నీ తలెకెక్కిందిరా స్మారకాల దొంగ రామూ! నీ విషం జనం బుర్రలోకి ఎక్కించడానికి ఇవి ‘ఈనాడు’ రోజులుకావు. ఇది ఇంటర్నెట్ యుగం డ్రామోజీ. ముదిమి వయసులో ఆరోగ్యం జాగ్రత్త! అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news