చినబాబుకు 40 ఏళ్లు గడిచినా, సిగ్గు రాలేదు – విజయ సాయిరెడ్డి

-

చినబాబుకు 40 ఏళ్లు నిండుతున్నా గాని, రాజకీయ పాఠాలు అతనికి చెప్పించండి, అన్నయ్యా! అంటూ లోకేశ్ కు చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ ఆధునిక రాజకీయ చరిత్రపై అవగాహన లేకనో, తెలుగుదేశం ‘సీనియర్‌ నేతల’ ప్రాంప్టింగ్‌ లో లోపాల వల్లనో గాని ఈ పార్టీ అధినేత పుత్రరత్నం ఈమధ్య మాట్లాడేవన్నీ తప్పుల తడకలే. పాలకపక్షం అధినేతపై అభాండాలు వేయడానికి అతను అవాస్తవాలు కావాలని చెబుతున్నాడనే అనుమానం కూడా వస్తోందన్నారు.

 

తండ్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు ‘ప్లానింగ్‌’ పుణ్యమా అని అమెరికాలో బీఎస్, ఎంబీఏ చదివిన నారా లోకేష్‌ కు రాజకీయ పరిజ్ఞానం బొత్తిగా లేదని, రాజకీయ ప్రత్యర్ధులపై అడ్డగోలు నిందలేయడం తప్ప ఏదీ రాదని పదే పదే రుజువవుతోంది. తాజాగా తన ‘సొంత’ నియోజకవర్గం మంగళగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిపై ఈ ‘నిరంతర విద్యార్థి’ చేసిన ఆరోపణ దీనికి చక్కటి ఉదాహరణ. కాంగ్రెస్‌ పార్టీకి ఏపీ సీఎం గతంలో ఎప్పుడో వెన్నుపోటు పొడిచారని లోకజ్ఞానం తెలియని లోకయ్య నాయుడు నోరు పారేసుకున్నాడ నిపేర్కొన్నారు.

 

అయితే, తాను సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర నాయకత్వం ఒంటెత్తు పోకడలతో తనపై కక్షసాధింపులకు పాల్పడిన కారణంగా 2011లో ఈ పార్టీ నుంచి ఏపీ ప్రస్తుత సీఎం వైదొలిగారు. అంతేగాదు, ఈ పార్టీ టికెట్‌ పై తనకు దక్కిన పార్లమెంటు సభ్యత్వానికి కూడా అదే రోజు రాజీనామా చేశారు. పార్టీపై తిరుగుబాటుగాని, అందులో సంక్షోభం సృష్టించడం గాని చేయలేదు. లోకేష్‌ తండ్రి చంద్రబాబు గారు తనకు ఆశ్రయం ఇచ్చిన రెండో రాజకీయపక్షమైన తెలుగుదేశం అధ్యక్షుడు, స్థాపకుడు, ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుకు 1995 ఆగస్టులో వెన్నుపోటు పొడిచారు. మామ గారు ఎన్టీఆర్‌ ప్రారంభించిన టీడీపీని కబ్జా చేసి సొంతం చేసుకున్నారు. కోస్తా జిల్లాల యాసలో చెప్పాలంటే చంద్రబాబు టీడీపీని ఎన్టీఆర్‌ నుంచి గుంజుకుని వాల్చేసుకున్నారు. ఈ రాజకీయ దురాక్రమణతో ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. రాజకీయ అవకాశవాదిగా అద్వితీయ నైపుణ్యం ప్రదర్శించిన చంద్రబాబు 1983లో తనను ఓడించిన టీడీపీలో ఎప్పుడు చేరినదీ ఎన్నడూ చెప్పరు. కాని, 1985 అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో తెలుగుదేశంను నెమ్మదిగా జేబులో కుక్కుకోగలిగారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news