ఏపీలో సంచలనం రేపిన అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై రాజకీయంగా దుమారం జరిగిన సంగతి తెలిసిందే. తమ నేతపై వీడియోతో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎంపీ అభిమానులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం కూడా ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపింది. అయితే అది ఒరిజినల్ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వైసిపి హై కమాండ్ ప్రకటించింది.
అయితే తాజాగా నేడు ( బుధవారం) ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసు పై అనంతపురం ఎస్పీ ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేశారు. ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చని ఎస్పీ తెలిపారు. వైరల్ గా మారిన ఈ వీడియో ఒరిజినల్ కాదని ప్రకటించారు.