రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు చేసే భాగ్యం కలిగింది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ బాధ్యతలు సంతోషం కలిగిస్తున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక .. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా నేను భావిస్తున్నాను. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించాను. 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్రను ప్రజల సమస్యల అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే తలపెట్టాను. చాలా లోతుగా ఆనాడు స్వయంగా పరిశీలన జరిపాను. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం సమస్యలపై బలమైన అవగాహన ఏర్పడింది.

విశాఖ మన్యంలో పర్యటిస్తున్న పుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను చెబుతూ.. అక్కడి బావిలో కలుషితమై పోయిన నీటిని చూపించారు. ఆ ప్రాంతంలోనే తోటవలస గ్రామానికి వెళ్ళినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఊరి వాళ్ళు వివరించారు. గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు పలు మత్స్యకార గ్రామం వాసులు తాగునీటి కోసం ఎన్ని ప్రయాసలు పడుతున్నారో చెప్పారు. గ్రామీణ అభివృద్ధి-దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడాన్ని గమనించాను. గుక్కెడు మంచి నీరు కోసం మైళ్ళ దూరం వెళ్లి ప్రయాసతో బిందెడు నీరు తెచ్చుకుంటున్న ఆడపడుచుల అవస్థలు చూసాను. కాలుష్యమయమైన జల వనరులనే తాగు నీరుగా తప్పని పరిస్థితుల్లో వాడుకుంటున్న పల్లెవాసులను గమనించానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news