గత కొద్ది రోజులుగా ఏపీవ్యాప్తంగా సంచలనంగా మారిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతంపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎన్నో కథనాలు వెలుగు చూశాయి. ఇందులో ఏది నిజం..? ఏది అబద్ధం..? అనేదానిపై ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ మీడియాకి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
హిడెన్ కెమెరాలు పెద్ద ఎత్తున అమర్చినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్. ఈ ఘటనలో కెమెరా లేదని.. వీడియోలు అంటూ జరిగేదంతా ప్రచారమే తప్పించి మరేం లేదని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై మంగళవారం రోజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల ఘటన ఫేక్ న్యూస్ అని భావిస్తున్నామన్నారు షర్మిల.
మూడు వేల కెమెరాలు పెట్టారని చెబుతున్నా.. ఎందుకు బయట పెట్టలేదు..? ఒకవేళ షవర్ లో పెట్టి ఉంటే నీళ్లు పడితే బ్లర్ అవుతుంది కదా..? అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మా టీమ్స్ వెళ్లి సర్వే చేస్తే అంతా ఫేక్ అని తేలిందన్నారు షర్మిల. ఒకవేళ కెమెరాలు పెట్టినట్లు ఎవరైనా నిజాలు బయటికి తీస్తే బాధితుల తరపున పోరాడతామని షర్మిల హామీ ఇచ్చారు.