మాజీ మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దియోథర్. నేడు గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సునీల్ దియోథర్ మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని కీలక వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని గుడివాడ యువతను సర్వ నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందని.. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను క్యాసినో, క్యాబేరె డాన్స్ లుగా మార్చేశారని మండిపడ్డారు. కొడాలి నాని నీ జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఇలాంటి వారిని జైలుకు పంపుతామన్నారు.