మేకపాటి పోస్టు ఎవరికి దక్కుతుంది?

-

ఏపీ రాజకీయాల్లో అరుదైన నేతగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డిని కోల్పోవడం చాలా బాధకరమైన విషయమనే చెప్పాలి…అధికార వైసీపీలో ఉంటూ…పార్టీలకు అతీతంగా పనిచేసే గౌతమ్ అంటే అందరికీ గౌరవమే. మంత్రి అంటే అందరికీ పనులు చేసే నాయకుడు అని నిరూపించారు. ఇక అలాంటి నాయకుడు గుండెపోటుతో మరణించడంతో యావత్ ఏపీ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇక మేకపాటి లేని లోటుని ఏ నాయకుడు కూడా భర్తీ చేయలేరని చెప్పొచ్చు..అలాగే మేకపాటి లేకపోవడం వైసీపీకి బాగా మైనస్. ఇప్పుడు మేకపాటి ప్లేస్‌ని రీప్లేస్ చేసే నాయకుడు ఎవరు కనబడటం లేదు…కానీ ఏదేమైనా మేకపాటి శాఖల బాధ్యతలని వేరే వారికి అప్పగించాల్సిన పరిస్తితి ఉంది. ఇప్పటివరకు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, చేనేత జౌళి శాఖల బాధ్యతలు మేకపాటి చూసుకున్నారు.

ఇప్పుడు ఆ శాఖలని వేరే వాళ్ళకు అప్పగించాలి..అయితే మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి జగన్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే…అప్పుడు ఈ శాఖలని ఒక నేతకు అప్పగించే ఛాన్స్ ఉంది…ఎలాగో మంత్రివర్గంలో మార్పులు చేయాలి కాబట్టి…ఇప్పుడు మేకపాటి పోస్టుని వేరే వాళ్ళకు ఇచ్చే ఛాన్స్ లేదు. కాకపోతే ఆయన శాఖలని వేరే మంత్రులకు అప్పగించవచ్చు. లేదా సీఎం జగన్ వద్దే ఆ శాఖలని ఉంచుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే మేకపాటి స్థాయిలో ఉన్నత విద్యని అభ్యసించి…ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతూ…విదేశాలు వెళ్ళి పెట్టుబడులని ఆకర్షించే సత్తా ఉన్న నాయకులు వైసీపీలో కనబడటం లేదు.

అయితే వైసీపీలో చదువుకున్నవారు బాగానే ఉన్నారు…కానీ మేకపాటి స్థాయిలో పనిచేసే సత్తా ఉన్నవారు కనిపించడం లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్తితుల్లో మేకపాటి పోస్టు వేరే వాళ్ళకు ఇవ్వాల్సిందే…మరి మేకపాటి పోస్టు ఎవరికి దక్కుతుందో చూడాలి. అలాగే మేకపాటి మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఆ స్థానంలో మేకపాటి కుటుంబ సభ్యులని ఎవరినైనా పోటీకి దింపుతారా? లేక వేరే నాయకుడుకు ఛాన్స్ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news