కులం – ప్రాంతం – సీనియారిటి: మంత్రిపదవులకు జగన్ ప్రాతిపదిక ఏమిటి?

-

వెళ్లింది ఇద్దరు… రెడీగా ఉన్నది పన్నెండుగురు అంటూ మంత్రిపదవులపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో కొలువు దీరిన‌ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎన్నిక‌వ్వ‌డంతో ఇప్పుడా రెండు మంత్రి ప‌ద‌వులు జ‌గ‌న్ ఎవ‌రికి క‌ట్ట‌బెడ‌తారు? అన్న‌దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.. ప్రస్తుతం వైకాపాలో ఇదే హాట్ డిస్కషన్!

పైగా రాజ్యసభ ఎన్నికలు కూడా ముగియడంతో… రెవెన్యూ శాఖ‌, మార్కెటింగ్ శాఖల బాధ్య‌త‌లు ఎవ‌రికి అప్ప‌గిస్తారు? దానికి జగన్ తీసుకునే ప్రాతిపదికలు ఏమిటి? కులమా… ప్రాంతమా… సీనియారిటీనా అన్న డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాటి లెక్కలు ఇప్పుడు చూద్దాం..

పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ.. ఇరువురూ బీసీ సామాజిక వ‌ర్గం నుంచి ఎపికైన మంత్రులు కావ‌డంతో జగన్ మ‌ళ్లీ అదే వ‌ర్గానికి ప‌ట్టం క‌డ‌తారా? లేక వారి వారి జిల్లాలకే వాటిని కేటాయించి, ఆ జిల్లాలో కొత్తవారికి అవకాశం ఇస్తారా? అది కూడా కాకుండా… మంత్రిపదవులకోసం ఆశగా చూస్తున్న ఆర్హులైన సీనియర్లకు ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో మోపిదేవిది గుంటూరు జిల్లా కాబట్టి… ఆ జిల్లాలో మంత్రిపదవులకు సంబందించి నాలుగు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వాటిలో ఒకటి.. లోకేష్ ను మట్టికరిపించడంతోపాటు, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా, కష్ట జీవిగా పేరున్న మంగ‌ళ‌గిర ఎమ్మెల్యే రామ‌కృష్ణ‌, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడతల రజిని! జిల్లాకు కాదు బీసీ సామాజిక వర్గానికే మంత్రిపదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకుంటే మాత్రం… అది విడతల రజినీకే దక్కేఅవకాశాలున్నాయి. అలాకాని పక్షంలో ఆర్కే పేరు ఉండొచ్చని అంటూన్నారు.

ఇక తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్.. మార్కెటింగ్ శాఖా మంత్రిగా ఉంటూ డిప్యూటీ సీఎంగా కూడా చేసారు కాబ‌ట్..టి కేటాయింపు అనేది చాలా విష‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ విషయంలో జిల్లా నుంచి కన్నబాబు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో జిల్లా ప్రాతిప‌దికన కాకుండా సీనియ‌ర్ నేత‌ని ఎంపిక చేసే అవ‌కాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ లెక్కన చూసుకుంటే… మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు, పార్థసారధి, రోజా లతో పాటూ మరికొంతమంది పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్క‌డ‌ సామాజిక వ‌ర్గం ని ప్రాతిపదికగా తీసుకుంటే… ధర్మాన, పార్థసారధి మధ్య పోటీ ఉండొచ్చు! సామాజిక వర్గం ప్రాతిపదిక కానిపక్షంలో రోజా పేరుకే జగన్ టిక్ పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news