జ‌గ‌న్‌ ఇలా పిల్ల రాజ‌కీయాలు చేస్తావా… మ‌హిళా మంత్రి గ‌రంగ‌రం…!

-

తెలుగు రాష్ట్రాల‌తో సంబంధం ఉన్న నేత‌లు జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో పుంజుకోవ‌డం .. ప‌ద‌వులు అందుకోవ‌డం.. ఉత్త‌రాది వారికంటే.. కూడా భిన్న‌మైన స్థానాల్లో వెలుగొందుతుండ‌డం.. చాలా చాలా అరుదు. పైగా మోడీ వంటి క‌రడు గ‌ట్టి.. గుజ‌రాతీ మ‌న‌స్త‌త్వం ఉన్న నేత‌లు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారికిప్రాధాన్యం ఇవ్వ‌డం కూడా క‌నా క‌ష్టంగా ఉంది. అయితే.. మోడీ కేబినెట్‌లో కీల‌క ప‌ద‌విని అలంక‌రించారు. నిర్మ‌లా సీతారామ‌న్‌. ఆమెకు తెలుగు నేల‌.. మెట్టినిల్లు. ఇంత కీల‌క స్థానంలో ఉన్న ఆమెపై కూడా జ‌గ‌న్ స‌ర్కారు బుర‌ద జ‌ల్లేందుకు… ప్ర‌య‌త్నించింద‌నే టాక్ జాతీయ స్తాయిలో వినిపిస్తోంది.

పోల‌వ‌రం నిధుల విష‌యంలో రాజ‌కీయంగా వ్యూహాలు వేసుకుని ముందుకు సాగాల్సిన జ‌గ‌న్ స‌ర్కారు… దానిని వ‌దిలి పెట్టి.. పిల్ల రాజ‌కీయాల‌కు తెర‌దీసింద‌ని జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. పోల‌వ‌రం నిధుల విష‌యంలో చంద్ర‌బాబు హ‌యాంలో ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యాన్ని 55 కోట్ల‌కు పెంచుతూ.. తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు. అయితే, ఇంత అవ‌స‌రం లేదు.. విభ‌జ‌న నాడు ఏం చెప్పారో.. దానికే క‌ట్టుబ‌డాలంటూ.. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ లేఖ‌లు రాసింది. దీంతో ఇప్పుడు కేంద్రం .. అదే ప‌నిచేస్తోంది. అయితే.. ఇదేదో.. సీతారామ‌న్ త‌మ‌పై క‌క్ష‌తోనే ఇలా చేస్తోంద‌ని అనుకున్న జ‌గ‌న్‌.. ఆమెతో నేరుగా మాట్లాడ‌లేక‌.. కేంద్రంలో ప‌నిచేసిన ఓ అధికారిని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని.. సీతారామ‌న్‌పై దుమ్మెత్తిపోయించి.. ఆమెకు అస‌లు మైండ్ లేద‌నేలా వ్యాఖ్య‌లు చేయించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన సుభాష్ చంద్ర గార్గ్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. గతేడాది కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గార్గ్ ను విద్యుత్ శాఖకు బదిలీ చేశారు. ఇది నచ్చకపోవడంతో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దీంతో  జగన్ ఏరికోరి ఆయ‌న‌ను ఆర్థిక సలహాదారుగా నియమించుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయ‌న‌నే త‌న రాజ‌కీయాల‌కు అస్త్రంగా వినియోగించుకున్నార‌ట జ‌గ‌న్‌. ఇటీవ‌ల గార్గ్‌.. నిర్మలా సీతారామన్ పై ఆరోపణలు చేశారు.

ఆమెది చాలా విభిన్నమైన వ్యక్తిత్వమని.. ఆమెతో కలిసి పనిచేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. ‘‘నా గురించి ఆమె ముందుగానే ఓ నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చేసినట్టు అనిపించింది. ఆమెకు నాపై నమ్మకం ఉన్నట్టు కనిపించలేదు. నాతో పనిచేసే విషయంలో ఆమె చాలా అసౌకర్యం ఫీలయ్యారు. పలు కీలక విషయాల్లో మా ఇద్దరి మధ్య తీవ్రస్థాయి బేధాభిప్రాయాలు కూడా వచ్చాయి’’ అని గార్గ్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. అయితే, ప‌ద‌వి విర‌మ‌ణ చేసిన ఏడాది తర్వాతే గార్గ్ ఈ ఆరోపణలు చేయడం వెనుక కారణమేంటనే చర్చ జరుగుతోంది.

ఏపీ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా గార్గ్ ను తెరపైకి తెచ్చి నిర్మలా సీతారామన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేయిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విష‌యంలో నిర్మ‌ల కూడా మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. జ‌గ‌న్ ఇంత క్రూర రాజ‌కీయానికి తెర‌దీస్తార‌ని అనుకోలేద‌ని ఆమె అనుకుంటున్న‌ట్టు జాతీయ మీడియా వెల్ల‌డించిన దానిని బ‌ట్టి తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news