గత ఆదివారం ఎచ్చర్ల మండలం ఫరీద్ పేటలో జరిగిన రాజకీయ కొట్లాటలో గాయపడ్డ YCP కార్యకర్త కూన ప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామంలో ఆదివారం రాత్రి కూన ప్రసాద్ పై టీడీపీ నేతలు దాడి చేశారు. దాంతో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ ను శ్రీకాకుళం జీజీహెచ్ కు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో వైద్యులు సలహా మేరకు కేజీహెచ్ కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే ఈ రోజు తెల్లవారుజామున కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ప్రసాద్.
ఇక కూన ప్రసాద్ మరణ వార్త విని దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు మాజీ MLA గొర్లె కిరణ్ కుమార్. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. కానీ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ దగ్గర మృతుడు డెడ్ బాడీతో ధర్నా కార్యక్రమం చేపడతామని అంటున్నారు YCP నాయకులు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని విడిచిపెట్టి అనామకులను అరెస్టు చేశారని తక్షణమే ఈ హత్యకు కారకులను అరెస్టు చేయాలి అని పరీధుపేట జాతీయ రహాదారి వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు YCP నేతలు, కుటుంబ సభ్యులు.