అమరావతి పరిధిలోని ఏడీసీ నర్సరీలను పరిశీలించారు మంత్రి నారాయణ. 41వేల కోట్లతో అమరావతికి గతంలో టెండర్లు ఇచ్చాం. అమరావతి పనుల కోసం 5000 కోట్లు కూడా పే చేశాం. లండన్ సంస్థ నార్మన్ పోస్టర్ వారితో డిజైన్ చేయించాం అని మంత్రి అన్నారు. ప్రస్తుతం 36 కోట్లతో కంప తొలగింపు చేపట్టాం.. 50 శాతం తొలగించాం. అయితే అమరావతిలో 4 పెద్ద పార్కులు వుంటాయి. శాఖమూరు సెంట్రల్ పార్కు 300 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా 2 వాటర్ లేక్ లు కూడా డెవలప్ చేస్తున్నాం.
కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కానల్ లకు రెండు వైపులా బఫర్ జోన్ వస్తుంది. అక్కడ ట్రీ ప్లాంటేషన్ కూడా చేస్తాం. మంచి వాతావరణం అమరావతిలో వుండేలా చర్యలు ఉన్నాయి.. టెండర్లు ఇంతవరకు చేసిన పనులతో క్లోజ్ చేస్తాం. అమరావతి నిర్మాణం ఆగిపోయి 5 ఏళ్లు అయింది. అయితే డిసెంబర్ మొదటి వారం నుంచి అమరావతి పనులు మొదలు పెట్టే అవకాశం వుంది అని మంత్రి నారాయణ తెలిపారు.