అంబులెన్స్ కి వైసీపీ రంగులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రంగుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఒకపక్క హైకోర్ట్ వద్దని చెప్తున్నా సరే వైసీపీ తీరు మారడం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ కి వైసీపీ రంగులు వేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటో ని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ అంబులెన్సులని వైసీపీ రంగులు వెయ్యడానికి కొన్ని నెలలుగా విజయవాడ లోని మెడికల్ కాలేజీలో పెట్టి ఉంచారని ఆయన ఒక పోస్ట్ చేసారు. కరోనా వైరస్ క్లిష్ట సమయాల్లో కూడా మీకు మీ పార్టీ నాయకులకి ఈ రంగుల పబ్లిసిటీ పిచ్చి ఏంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారూ అంటూ ఉమా పోస్ట్ చేసారు. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి రంగుల విషయంలో షాక్ తగిలిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంతో వాటిని చెరిపివేయాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగా సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు వైసీపీ నేతలు. దీనిపై అక్కడ కూడా సుప్రీం షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయ రంగు వేస్తే ఊరుకుంటారా అని ఎదురు ప్రశ్నించగా ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇప్పుడు రంగులు తుడిపివేసే కార్యక్రమం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news