ఎసెన్షియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పార్టీ తరపున 5 లక్షలు.. గాయపడ్డ వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది వైసీపీ. పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఎక్కడ బాధితులు వుంటే అక్కడ స్థానిక నాయకత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది అని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక అనకాపల్లిలో బాధితుల పరామర్శకు వచ్చి జగన్ చేసిన సూచనలపై ప్రభుత్వంలో వున్న వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి మీద స్థాయి మరిచిపోయి చేస్తున్న విమర్శ లు అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు రాళ్ళు విసిరితే కాచుకోవడానికి మేము సిద్ధం. కానీ బాధ్యతలు మరిచిపోయి వ్యవహరించవోద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే ధర్నా చేస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు.. ఫ్యాక్టరీ యాజమాన్యం కనిపించడం లేదని ప్రభుత్వం చెప్పడం ఏంటి.. వాళ్ళు ఎక్కడ వున్న పట్టుకుని లాక్కరావలసిన బాధ్యత ప్రభుత్వానికి వుంది. ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.