సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత పునూరు గౌతమ్ రెడ్డి విచారణ పూర్తి అయ్యింది. అయితే మళ్ళీ ఈ నెల 7వ తేదీ కూడా విచారణకు రావాలని పోలీసులు ఆయనకు తెలిపారు. అయితే పోలీస్ స్టేషన్ నుండి బాటకు వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నన్ను చంపేందుకు పోలీసు కమిషనర్ ప్రయత్నించారు. పోలీసులు అర్ధరాత్రి సమయంలో మా ఇంట్లోకి అక్రమంగా దొంగల్లాగా చొరబడ్డారు. అలాగే నన్ను చంపేందుకు పోలీసులు తలుపులు పగలగొట్టి దొంగలకి మార్గం చూపించారు అని ఆయన ఆరోపించారు.
కాబట్టి ఆ భయంతోనే ముందస్తు బెయిల్ కోసం వెళ్లాను. అయితే ఈ గొడవకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వివిధ బ్రాహ్మణ సంఘాలు తీర్మానించిన తర్వాతే ఆ స్థలాన్ని కొన్నాను. కోర్టులో ఈ కేసు ఉన్నందున మాట్లాడలేను. కానీ నా మీద టీడీపీ ప్రభుత్వం కేసు నమోదు చేయించింది. అయితే ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని గౌతమ్ రెడ్డి స్పష్టం చేసారు.