రాసలీలల వీడియోలు వైరల్..ఎంపీ గోరంట్ల మాధవ్ క్లారిటీ

-

వైసీపీ పార్టీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో న్యూడ్‌ గా వీడియో కాల్‌ మాట్లాడిన వీడియో బయట పడింది. ఆ వీడియోలో న్యూడ్‌ గా ఉన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌.. ఆ మహిళతో మాట్లాడుతున్నాడు. మహిళతో శృంగారానికి సంబంధించిన విషయాలను మాట్లాడినట్లు రికార్డు అయింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ రాసలీలల వీడియో లీక్‌ కావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

అయితే..ఈ వీడియోలపై ఎంపీ గోరంట్ల మాధవ్‌ క్లారిటీ ఇచ్చారు. వీడియో లను మార్ఫింగ్ లు చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రమని.. ఏ విచారణకైనా సిధ్దమని స్పష్టం చేశారు.

ఇప్పటికే, జిల్లా ఎస్.పి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరానని వివరించారు. దీనిపై ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిధ్దమే తెలుగు దేశం పార్టీ కి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట చేసిన కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై పరువునష్టం దావా వేస్తానన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్‌.

Read more RELATED
Recommended to you

Latest news