చెల్లెలిపై అన్న అత్యాచారం.. అబార్షన్ వికటించడంతో!

వావివరుసలు మరిచి మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఓ అన్న తన చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఆమెకు నకిలీ డాక్టర్ దగ్గర అబార్షన్ చేయించాడు. దీంతో అబార్షన్ వికటించడంతో యువతి మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లా కడయాంబట్టిలోని మేల్‌కొంబై ప్రాంతానికి చెందిన యువతి (19 ఏళ్లు) ఇంజినీరింగ్ చదువుతోంది. 2018లో ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో యువతి అన్న నకిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు.

అత్యాచారం
అత్యాచారం

అబార్షన్ వికటించడంతో యువతిని సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేయించాడు. 10 రోజుల తర్వాత యువతి మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి గర్భానికి కారణం ఆమె అన్న హరీష్ అని తెలిసింది. ఇంట్లోనే చెల్లెలితో సన్నిహితంగా మెలగడంతో ఆమె పలుమార్లు గర్భిణీ అయిందని, అబార్షన్లు చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు నకిలీ డాక్టర్ సుల్తానా, హరీష్‌ను అరెస్ట్ చేశారు. బుధవారం బెయిల్‌పై విడుదలైన హరీష్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.