విద్యార్థులు అలర్ట్‌.. 6న దోస్త్ ఫస్ట్‌ ఫేస్‌

-

తెలంగాణలో డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే (దోస్త్‌) దరఖాస్తు గడువు ముగిసింది. డిగ్రీలో ప్రవేశాలకు మొత్తం 1,44,300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. అందులో 1,24,495 మంది స్టూడెంట్లు తమ అప్లికేషన్లను సమర్పించినట్లు పేర్కొన్నారు లింబాద్రి. మొదటి విడత కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా 1,15,845 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 6 నుంచి ఫస్ట్ ఫేజ్ డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు లింబాద్రి.

CBSE 12th Result 2022 Declared LIVE: Class 12 Result Link At  Cbseresults.nic.in; Websites To Check, Login Details

ఈ నెల 7 నుంచి 18 వరకు సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు లింబాద్రి. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,088 కళాశాలల్లో 4,68,880 డిగ్రీ సీట్లు అందబాటులో ఉన్నాయి లింబాద్రి.

 

Read more RELATED
Recommended to you

Latest news