చిలకలూరిపేట టికెట్‌ పై రఘురామ సంచలనం !

-

 

ఎన్నికల్లో టికెట్ల కోసం ఎంతో మంది వద్ద వైకాపా నాయకత్వం డబ్బులను వసూలు చేసిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. వైకాపా నాయకత్వానికి డబ్బులు ఇచ్చిన వారు తిరిగి తమ డబ్బులను రాబట్టుకోవాలంటే రాజేష్ నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. మంత్రి విడుదల రజిని గారిని గుంటూరుకు బదిలీ చేసిన తర్వాత చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇన్చార్జిగా రాజేష్ నాయుడు గారిని నియమించారని తెలిపారు.

రానున్న ఎన్నికల్లో టికెట్ కోసం ఆరున్నర కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా రాజేష్ నాయుడు గారు మీడియా ముందు వాపోయారని, ఆరున్నర కోట్ల రూపాయలలో నుంచి పెద్ద మనసు చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మూడు కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చారని, మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలు పెద్దాయన ఖాతాకు చేరి ఉంటాయని అన్నారు. టికెట్ల కోసం డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు, తమ సగం డబ్బులనైనా రాబట్టుకోవాలంటే రాజేష్ నాయుడు గారి తరహాలో మీడియా ముందుకు వెళ్తామని చెప్పాలని, ఈ వార్త అన్ని చానళ్లలో, పేపర్లలో ప్రముఖంగా వచ్చినప్పటికీ, సాక్షి దినపత్రికలో మాత్రం కనిపించలేదని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news