వీర్రాజుకు కౌంటర్స్ వేయబోయి లోకేష్ గాలి తీసేసిన ఎల్లో మీడియా!

-

అంతా ఊహించినట్లుగానే ఏపీ బేజేపీ అధ్యక్షుడి హోదా నుంచి కన్నా లక్ష్మీనారాయణను తొలగించి.. సోము వీర్రాజుకి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఇది పూర్తిగా బీజేపీ అంతర్గత వ్యవహారం. కన్నా పదవిపోవడానికి పరోక్షంగా చంద్రబాబుతో ఆయనకున్న సాన్నిహిత్యం.. ఏపీ బీజేపీని “పిల్ల టీడీపీ” మార్చారంటూ కన్నాపై విమర్శలు! ఇదే సమయంలో అమరావతిపై తన సొంత నిర్ణయాన్ని పార్టీ నిర్ణయంగా చెబుతూ లేఖ రాయడం! ఫలితం.. సోము వీర్రాజుకు పదవి షిప్ట్ అయ్యింది! సరిగ్గా ఈ సమయంలో టీడీపీ అనుకూల మీడియాకు సోము టార్గెట్ అయిపోయారు!

అవును… కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, సోము వీర్రాజుకి పదవి ఇచ్చిన అనంతరం లాజిక్కులు లాగడం మొదలుపెట్టింది ఆ వర్గం మీడియా. సోము శక్తి సామర్ధ్యాలపై కథనాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అందులో ప్రధానంగా వినిపించిన మాట… “సోము వీర్రాజు ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవలేదు.. ఇలాంటి వ్యక్తికి పార్టీ పగ్గాలా..” అని! ఈ విమర్శకు రెండు సమాధానాలు ఉన్నాయి.. వాటిలో రివర్స్ కౌంటర్స్ కూడా ఉన్నాయి!

ఒకటి… భారతీయ జనతాపార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి, సదా పరోక్ష ఎన్నికలే నమ్ముకున్న సంగతి తెలిసిందే. అలా ఉన్నా కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేశారు! ఇక రెండోది… టీడీపీ భవిష్యత్ ఆశాకిరణం నారా లోకేష్ కూడా ప్రతక్ష ఎన్నికల్లో ఓడిపోయారు.. పార్టీ పదవిలో వున్నారు.. మంత్రిగా కూడా పని చేసేశారు! ఈ లెక్కన చూసుకుంటే… లోకేష్ కంటే సోము ఏమీ తీసిపోలేదు అనేది ఆయనవర్గం మాట!! ఈ విషయలో సోము ఎలిజిబిలిటీ గురించి ప్రస్తావించి… చివరికి లోకేష్ కు కౌంటర్స్ పడేలా చేస్తున్నాయి ఆ మీడియా వర్గాలు!!

Read more RELATED
Recommended to you

Latest news