‘ లీకు ‘ వీరులు ఎవరో ? ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ ?

వైసీపీ అధినేత జగన్ ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. ఏ విషయమైనా క్లారిటీగా చెప్పడం తో పాటు, చేసి చూపిస్తూ ఉంటారు. అలాగే పార్టీ కీలక నాయకులు, మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా ఎవరు ఏమి చేస్తున్నారు ? వారి వ్యవహారాలు ఏమిటి ? క్షేత్రస్థాయిలో వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి ? ఇలా అన్ని విషయాల పైన క్లారిటీతో ఉంటారు. ఏ విషయంలో నిర్లక్ష్యం గా ఉండరు  ఒకవేళ ఎవరైనా ఉన్నా ఆషామాషీగా అయితే వదిలిపెట్టరు. ఇక జగన్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందుగా నిర్ణయాలను పార్టీల నేతలతో పాటు మంత్రులతో చర్చించి దానిపై అభిప్రాయం తీసుకుంటున్నారు కానీ, ఆ విషయంలో జగన్ ఏ ఫైనల్ నిర్ణయం తీసుకోక ముందే, దానికి సంబంధించిన సమాచారం అంతా మీడియాకు తెలిసిపోతుంది. దాంతో జగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మీడియాలో హైలెట్ కావడం, ప్రత్యేక కథనాలు వెలువడడం ఇలా ఎన్నో, చాలాకాలంగా జరిగిపోతున్నాయి.

అసలు ఈ విషయాలు మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయో అర్థం కావడం లేదు. తాను ఏరి కోరి కూర్ప చేసుకున్న మంత్రుల్లో మీడియాకు లీకులు ఇచ్చే వారు ఎవరు అనేది అంతు పట్టడం లేదు. ఒకటి కాదు రెండు కాదు, ప్రతి మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే తంతు జరుగుతుండడంతో జగన్ తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. దానికి తోడు అనుకున్న ఒక్క పని జరగకపోవడంతో జగన్ కు మరింత ఆగ్రహం కలిగిస్తోంది. దీంతో మంత్రులపై జగన్ పూర్తిగా నిఘా పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ఏదైనా కొత్త కార్యక్రమం అమలు చేద్దాం అనే ఆలోచనల్లో ఉండగానే, అది బయటకు లీక్ అయిపోవడంతో ప్రతిపక్షాలు దానిని అడ్డుకునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని, కోర్టుల్లో అడ్డుకునేందుకు ముందుగానే సిద్ధం అవుతోంది. మామూలుగానే జగన్ ఏదైనా సంచలన నిర్ణయం  తీసుకున్నా, ముందుగా మంత్రులతో చర్చించే అలవాటు లేదు. కేవలం ఫలానా నిర్ణయం తీసుకున్నానని, అది ఫలానా తేదీన అమలు చేస్తామని మాత్రమే మంత్రులకు చెబుతూ ఉంటారు.
ఈ వ్యవహారం కొంతమంది మంత్రులు అసంతృప్తికి దారితీస్తోంది. ఆ సంతృప్తి ని ఈ విధంగా మీడియా ముందు వెళ్లగక్కుతున్నారు అనే విషయం పైనా ఇప్పుడు చర్చ నడుస్తోంది. మరికొంత మంది మంత్రులు గతం నుంచి మీడియా తో ఉన్న అనుబంధం కారణంగా ఈ వివరాలన్నీ బయటకు లీక్ చేస్తున్నారనే విషయం ఇప్పుడు బయటకి వస్తోంది. ఏది ఏమైనా, ఈ లీకుల విషయంలో జగన్ చాలా సీరియస్ గానే ఉన్నట్టు అర్థం అవుతోంది. ఈ లీక్ వీరులు ఎవరో తెలిస్తే వేటు వేసేందుకు జగన్ వెంకాడేలా కనిపించడం లేదు.
-Surya