BREAKING : వైఎస్‌ సునీత పొలిటీకల్‌ ఎంట్రీ..పోస్టర్ల కలకలం

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ కాగా, త్వరలోనే అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఈ తరుణంలోనే.. వైఎస్‌ సునీత పొలిటీకల్‌ ఎంట్రీ.. ఇస్తున్నట్లు పోస్టర్లు కల కలం రేపుతున్నాయి.

కడపజిల్లా..ప్రొద్దుటూరు.. పోస్టర్ల కలకలం రేగింది. వై.యస్. సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రి కి రాత్రి పట్టణంలో వాల్ పోస్టర్ల అతికించారు గుర్తు తెలియని వ్యక్తులు. పోస్టర్ లలో వై.యస్.వివేకా, టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్య నేతల ఫోటోలు ఉన్నాయి. అయితే, ఈ ఫోటోలు ఎవరు అతికించారనే విషయం తెలియరాలేదు. నిజంగానే, వైఎస్‌ సునీత పొలిటీకల్‌ ఎంట్రీ ఇస్తారా.. లేక.. ఇదంతా ఫేక్‌ న్యూస్‌ అనేది తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news