ప్రస్తుతం హస్తిన వేధికగా ఏపీకి సంబంధించి హాట్ హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి! కేంద్ర కేబినెట్ లోకి మోడీ – అమిత్ షా లు జగన్ ను ఆహ్వానిస్తున్నారని.. అందుకు జగన్ కొన్ని కండిషన్స్ పెట్టి, అవన్నింటినీ తీర్చడానికి మోడీ ఒప్పుకున్న పక్షంలో కేంద్ర కేబినెట్ లోకి చేరడానికి సుముఖత వ్యక్తం చేయబోతున్నారని హస్తిన రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి! దీంతో… చంద్రబాబు బెంగట్టుకున్నారని అంటున్నారు!!
అవును… జగన్ కు అలా కలిసివస్తున్నాయో ఏమో తెలియదు కానీ… ఇంతకాలం అత్యంత బలంగా ఉన్న మోడీ సర్కార్ కు బీటలు వారుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు! అందులో భాగంగానే… ఇటీవల ఎన్.డి.ఏ. నుంచి మిత్రపక్షం అకాలీదళ్ వైదొలిగిందని అంటున్నారు. ఇది ఆరంభం మాత్రమే అని.. ఇలాంటివి ఇంకా జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు! దీంతో అత్యంత బలంగా ఉన్న సౌత్ లో వైకాపాను కలుపుకోవాలని భావిస్తోంది బీజేపీ!
ఈ నేపథ్యంలో.. కేంద్ర కేబినెట్ లోకి వైసీపీని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ తో అమిత్‌షా కీలక చర్చలు జరిపారని.. వారి మధ్య సానుకూల చర్చలు జరగడంతోనే తుది విడతగా ప్రధానితో జగన్ కీలక చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. దీంతో మంగళవారం మీటింగ్ లో… ప్రధాని వద్ద వైసీపీ డిమాండ్లు ఏంటో స్పష్టంగా చెప్పి.. వాటిని నెరవేర్చేందుకు ప్రధాని సరేనంటే మాత్రం కేంద్ర కేబినెట్ లో చేరేందుకు జగన్ అంగీకారం తెలపనున్నారని తెలుస్తోంది!
అన్నీ అనుకూలంగా జరిగి జగన్, మోడీ కేబినెట్ లో చేరితే.. విజయసాయిరెడ్డికి కేంద్ర కేబినెట్ హోదా ఇవ్వడంతో పాటు ఒక బీసీ, ఒక ఎస్సీ సభ్యులకు సహాయ మంత్రిత్వశాఖలు తీసుకునేందుకు జగన్ ఓ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం.. బాబు బీజేపీపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలైపోతాయని.. 2024 ఎన్నికల సమయానికంటే ముందే ఏపీలో టీడీపీ దుకాణం బంద్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు!
-Ch Raja