నాని సినిమాలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి..!

-

మెగాస్టార్ మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ఉప్పెన. ఈ సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే అందరిని ఆకర్షించింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల అయ్యాయి. ఆ వీడియోల్లో కృతి ఎక్స్‌ప్రెషన్స్‌ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.అందుకేనేమో ఈ కన్నడ బ్యూటీకి సినిమా విడుదలకు ముందే మరో బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

రాహుల్‌ సంక్రీత్యన్ దర్శకత్వంలో నాని నటించబోతున్న శ్యామ్ సింగరాయ్‌లో ముగ్గురు హీరోయిన్స్ నటించబోగా అందులో ఒక హీరోయిన్ గా నటించమని కృతిశెట్టినీ సంప్రదించినట్లు సమాచారం.ఇప్పటికే ఒక హీరోయిన్ గా సాయి పల్లవి ఖరారైనట్లు సమాచారం. ఇక మిగిలిన రెండు పాత్రల్లో ఓ కారెక్టర్ కోసం కృతిని, రాహుల్ సంప్రదించినట్లు టాక్. ఇప్పటికే కృతి స్టోరీని విన్నదని, తన నిర్ణయం త్వరలోనే చెబుతానని వెల్లడించింది. ఈ సినిమా గాని ఓకే అయితే కృతి మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే..!!

Read more RELATED
Recommended to you

Latest news