ఏపీలో దారుణం..కుమార్తెకు మద్యం తాగించి కన్న తండ్రి లైంగిక దాడి..!

-

ఏపీ లో మరో దారుణం చోటుచేసుకుంది. కన్నకూతురిపై కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వై ఎస్ ఆర్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య, 15 ఏళ్ల కూతురు ఉన్నారు. కాగా తన కూతురును ఉద్యోగం చేస్తున్న వైఎస్ ఆర్ జిల్లా బెస్తవారిపేటకు తీసుకెళ్ళాడు. ఉద్యోగి తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికి కూతురుని తీసుకెళ్ళాడు.

child rape cases
child rape cases

ప్రియురాలి తో కలిసి మద్యం సేవించి బలవంతంగా కూతురుకు సైతం తాగించాడు. అనంతరం కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతూ ప్రియురాలిని వీడియో తీయాలని చెప్పాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది.దాంతో ఈ ఘటన పై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ కసాయి తండ్రి తో పాటు అతడి ప్రియురాలిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సెల్ ఫోన్ తీసుకుని వీడియోలను సీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news