చేతులు ఎత్తేసిన జగన్… ఇప్పుడు ఏపీ పరిస్థితి ఏంటీ…?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులు ఎత్తేసారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ రాష్ట్రంలో లాక్ డౌన్ ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నారు రాష్ట్రంలో. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్ధికంగా బాగా నష్టపోయిన రాష్ట్రం. రాష్ట్ర విభజన తర్వాత ఆ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు తగ్గాయి.

హైదరాబాద్ లాంటి బంగారు పళ్ళెం లేకపోవడం, రాజధాని లేకపోవడం తో ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం భారీగా తగ్గింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తిగా ఆపేయడం తో ఆదాయం భారీగా తగ్గింది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా కరోనా దెబ్బకు ఆదాయ౦ అనేది పడిపోయింది. ఎమ్మెల్యేలకు, ఉద్యోగులకు, జగన్ వచ్చిన తర్వాత నియమించిన వాలంటీర్లకు,

ఇప్పుడు ఎవరికి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఏపీలో కనపడటం లేదు. ఇప్పుడు ప్రజలు బయటకు రావడం లేదు. వారికి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు అక్కడ ఆదాయ మార్గాలు ఏమీ లేకపోవడంతో జగన్ సర్కార్ ఎం చెయ్యాలా అనే ఆందోళనలో ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడుతూనే ఉంది.

రాష్ట్రాలకు సహాయం చేసే స్థితిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇన్నాళ్ళు ఇబ్బంది లేదు అనుకున్న జగన్ కి ఇప్పుడు కరోనా చుక్కలు చూపిస్తుంది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో కనీసం పెన్షన్లు అయినా ఇస్తారా లేదా అనేది అర్ధం కావడం లేదు. ఇప్పటికే ఆర్ధిక శాఖ దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. జగన్ కూడా ఇప్పటికె అధికారులకు ఆదాయ మార్గాలను చూడాలని ఆదేశాలు కూడా జారీ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news