దారుణం: గెస్ట్‌ హౌస్‌కు రప్పించి మహిళా ఉద్యోగిపై గ్యాంగ్ రేప్!

పార్టీ పేరుతో గెస్ట్ హౌస్‌కు రప్పించి ఓ మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ జిల్లాలోని విధాన్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బీపీఓ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఓ మహిళ(30)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఒక మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

మహిళ-అత్యాచారం
మహిళ-అత్యాచారం

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సీనియర్ సహచరులు ఇద్దరు పార్టీ పేరుతో గెస్ట్ హౌజ్‌కు పిలిచారన్నారు. మత్తు మందు కలిపిన డ్రింక్‌ను ఇచ్చి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన సమయంలో మహిళా కొలీగ్ కూడా ఉందని, ఆమె హస్తం కూడా ఉందన్నారు. ఈ మేరకు జూన్ 15వ తేదీన బగియాటి పోలీస్ స్టేషన్‌లో ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు భాస్కర్ బెనర్జీ, ఇంద్రాణిదాస్, చరణ్‌జిబ్ సూత్రధార్‌లను అరెస్ట్ చేశారు.