నాగచైతన్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్..!

-

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య.. మొదట్లో అడపా దడపా సినిమాలు చేసి పర్వాలేదనిపించుకున్నాడు. అయితే ఈయన ఖాతాలో విజయాలు ఉన్నాయి కానీ.. కమర్షియల్ హిట్ ఒకటి కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా 2021లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన లవ్ స్టోరీ సినిమా ద్వారా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఈ సినిమాతో కమర్షియల్ విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు నాగచైతన్య కెరియర్ లోని ఈ సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈయన నటించిన చిత్రం బంగార్రాజు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది.

అయితే ఈ సినిమా తర్వాత థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో నాగచైతన్య కెరియర్ మళ్ళీ డౌన్ అయినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహించిన తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రం కస్టడీలో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే కొత్త సంవత్సరం సందర్భంగా కస్టడీ మేకర్ విడుదల చేసిన మొదటి గ్లింప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాగచైతన్య కస్టడీ గ్లింప్ కి 2.5 మిలియన్ ప్లస్ న్యూస్ రావడంతో బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. కస్టడీ నిర్మాతలు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. గ్రిప్పింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ఏరియల్ షాట్లతో ఈ గ్లింపు ప్రారంభమైంది. రివర్స్లో ఉన్న కార్లు పేలడంతో అక్కినేని నాగచైతన్య రంగంలోకి దిగారు.అలా ఈ గ్లింప్ బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విలన్ గా అరవిందస్వామి హీరోయిన్ గా కృత్తి శెట్టి అలాగే ప్రియమణి కూడా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రేమ్ జీ , వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, ప్రేమీ విశ్వనాథ్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news