మరో ప్రాణాంతకమైన వ్యాధి.. మగవారికి మాత్రమే..?

ఓవైపు కరోనా వేరు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంటే మరి కొన్ని రకాల వైరస్లు కూడా మనుషులపై దాడి చేసి ప్రాణాలను హరించుకు పోవడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఎన్నో సరికొత్త వైరస్ లు వెలుగు లోకి వస్తూ ప్రజలందరినీ తీవ్ర భయాందోళనలు గురి చేస్తున్నాయి. ఇటీవలే మరో ప్రాణాంతకమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం మగవారికి మాత్రమే సోకుతూ ఉండడం గమనార్హం. వేగంగా మగవారికి సోకుతూ ప్రాణాలని కూడా బలిగొంటోందట ఈ వైరస్.

వెక్సెస్ సిండ్రోమ్ అనే జబ్బు ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తూ ప్రాణాలు తీసుకుపోవడానికి సిద్ధమవుతోంది అని పరిశోధకులు తెలిపారు. ఈ వైరస్ బారిన పడితే రోజుల వ్యవధిలోనే ప్రాణాలు పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అమెరికాకు చెందిన ఎన్హెచ్జీఆర్ ఐ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. యూబిఏ-1 మ్యుటేషన్ వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది అంటూ తెలిపిన శాస్త్రవేత్తలు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.