ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ సోకిన రోగుల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కరోనా సోకిన వారిలో మళ్లీ కోలుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఇన్ఫెక్షన్ సోకడం, దవడలు వంకర పోవడం, ముఖ్యంగా కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఆస్పత్రుల్లో చేరక తప్పడం లేదు.
ఇక కరోనా రోగుల్లో రోగనిరోధక శక్తి కోల్పోయి ఫంగస్ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల్లో గత 15 రోజుల్లో 12 మందికి తీవ్ర ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. ఇక వ్యాధి సోకినా వారిలో మూత్రపిండాల వ్యాధి, మధుమేహం ఉన్నవారిలో కోవిడ్ మరింత ప్రభావం చూపుతుందన్నారు. అలాంటి వారిలో రోగనిరోధక శక్తి తగ్గడమే కాకుండా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తమ పరిశీలనలో తేలినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అయితే ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల వ్యాపారవేత్తకు నవంబర్ 20న కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతనికి జ్వరం తీవ్రమై దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ఇతర మందులు, ఆక్సిజన్ అందజేశారు. ఏడు రోజుల తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎండమ దవడ, కన్ను, ఎముకలు, కండరాలు, మెదుడుపై తీవ్ర ప్రభావం చూపింది. తీరా అతనికి యాంటీవైరస్ మందులు, క్రిటికల్ కేర్ సపోర్టు ఇచ్చారు. దీంతో ఆయన నెమ్మదిగా కోలుకున్నారు. ఇలా కోవిడ్ సోకిన చాలామంది ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వీలైనంత త్వరగా యాంటీ ఫంగస్ థెరపీని ప్రారంభించాలని సూచిస్తున్నారు.