జగన్ కు షాక్ : కృష్ణా బోర్డు కు తెలంగాణ సర్కార్ మరో లేఖ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కే‌ఆర్‌ఎం‌బి ఛైర్మన్ కు మరో లేఖ రాసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు హైద్రాబాద్ రాష్ట్రం తయారు నందికొండ ప్రాజెక్టు నివేదికలు (1952), ఉమ్మడిగా హైద్రాబాద్, ఆంధ్ర రాష్ట్రాలు తయారు చేసిన ప్రాజెక్టు రిపోర్ట్ ను (1954) బేఖాతరు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఇష్టా రీతిగా పెంచుకుంటూ పోయారని సర్కార్ లేఖలో పేర్కొంది. 1952 లో హైదరబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదిక లో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలుకాలో కట్లెరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించడం జరిగిందని.. . మద్రాసు రాష్ట్రం లో ప్రతిపాదించిన ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలు మాత్రమేనని వెల్లడించింది.

1956 లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు నివేధికకు భిన్నంగా ఆంధ్ర ప్రాంతం లోని ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఏకరాలకు పెంచిందని..అదే సమయం లో తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు తగ్గించిందని లేఖలో వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం.

ఒక లక్ష ఎకరాలను లిఫ్ట్ పథకాల ద్వారా సాగులోకి తీసుకు రావాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదని మండిపడింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయం లో ఆంధ్ర, హైదరబాద్ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేనందువల్ల ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు 1954 ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతం లోని ఆయకట్టును కట్లెరు వాగు వరకు 1.3 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని కోరింది. జులై 15 గజెట్ నోటిఫికేషన్ లో షెడ్యూల్ 2 లో పేర్కొన్న 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించవలసిందిగా కోరుతూ ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కు తెలియజేయవలసిందిగా డిమాండ్ చేసింది.