వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. మెసేజ్ ఎడిట్ ఇలా చేయొచ్చు..

-

ప్రస్తుతం జనాలు మనుషుల తో మాట్లాడటం తక్కువ అయ్యింది.కేవలం సోషల్ మీడియా ద్వారా పలకరింపులు, సంప్రదింపులు చేస్తున్నారు. సోషల్ మీడియా యాప్ లలో మొదటగా వినిపించే పేరు వాట్సాప్… ఈ వాట్సాప్ తో ప్రపంచం లో ఎవరితోనైనా మాట్లాడవచ్చు..ఇప్పటికే ఈ యాప్ ను అన్నీ విధాలుగా అప్డేట్ చేశారు..అయితే ఇప్పుడు మరో కొత్త ఆఫ్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దాని గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము..

WhatsApp
WhatsApp

 

ట్విట్టర్ లో చేసినట్లుగా వాట్సప్ లోనూ మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ రానుందట. ఈ మేరకు ఆల్రెడీ బీటా వెర్షన్ లో టెస్టింగ్ జరుగుతుందని అంటున్నారు.ప్రస్తుతం వాట్సప్ యూజర్లందరికీ ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో లేదు. ఒక్కసారి పంపిన మెసేజ్ వదిలేయాలి. లేదంటే డిలీట్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా పంపిన మెసేజ్ కు ఎడిట్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.మెసేజ్ చేసే విధానంలో WhatsApp కొన్ని పెద్ద మార్పులను చేసింది. “మెసేజ్‌లకు రెస్పాండ్ అవడానికి ఫీచర్‌ను విడుదల చేశాం. WhatsApp ఇప్పుడు సందేశాలను పంపాక వాటిని సవరించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వాట్సాప్ ఐదేళ్ల క్రితం ఈ ఫీచర్‌పై పని చేయడం ప్రారంభించింది.

గతంలో ట్విట్టర్ లో ఉన్న ఫీచర్ చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ వాట్సప్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చింది..Wabetainfo ప్రస్తుతం డెవలప్ చేస్తున్న ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. మెసేజ్‌లను కాపీ చేయడానికి, ఫార్వార్డ్ చేయడానికి ఆప్షన్లతో పాటు, వినియోగదారులు ఎడిట్ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. మాడిఫై బటన్‌ను ఎంచుకున్న తర్వాత, సందేశాన్ని పంపిన తర్వాత కూడా సందేశంలో ఏదైనా అక్షర దోషం లేదా స్పెల్లింగ్ లోపాన్ని సరిచేయవచ్చు..ఈ ఫీచర్ తో వాట్సప్ కు యాజర్లు పెరిగే అవకాశం ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news