వైద్య హత్య : ఎర్రగడ్డ వైద్యుల నిర్వాకం..! 24 గంటలు..2 సెల్ఫీ వీడియోలు..2 మృతి…

-

another person passes away in erragadda hospital records selfie video
another person passes away in erragadda hospital records selfie video

పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేస్తున్నారు మేము అద్భుతమైన వైద్యం అందిస్తున్నాము అంటున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్. కానీ నిజానికి తెలంగాణలో ఎక్కడా అద్భుతమైన వైద్యం అందించట్లేదాని వార్తలు వస్తున్నాయి. డాక్టర్లు నిర్లక్ష్య దొరణి వహిస్తున్నారు మనుషుల ప్రాణాలు తీస్తున్నారు, పేషంట్ తరఫు వాళ్ళు దాడులు చేస్తే స్ట్రైకులు చేస్తున్నారు. కేవలం 24 గంటల వ్యవదిలో తెలంగాణలోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు వైద్యులు. నిన్న ఓ వ్యక్తి తనకి ఊపిరాడటం లేదని వేడుకున్నా బలవంతంగా ఆక్సిజన్ ఆపేశారని సెల్ఫి వీడియో తీసి తన తండ్రికి పంపాడు. పంపిన గంటల్లోనే ఆ వ్యక్తి మరణించాడు ఇక ఇదే క్రమంలో నేడు మరో వ్యక్తి చనిపోయాడు. ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి వైద్యులు మరో అభాగ్యుడిని పొట్టనపెట్టుకున్నారు. తనకు చికిత్స చేయడం లేదని సెల్ఫీ వీడియో తీసి సయ్యద్‌ అనే రోగి చనిపోయాడు. అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వీడియోలో సయ్యద్‌ వాపోయాడు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో డబ్బు పెట్టలేక ప్రాణ ప్రీతితో కోటి ఆశలతో ప్రభుత్వాన్ని నమ్ముకొని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటే వైద్యులు నిర్లక్ష్య దొరణి వహిస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీడియా కూడా ఏం చేస్తుంది పని గట్టుకొని మరీ ప్రచారం చేయడం తప్ప..!

Read more RELATED
Recommended to you

Latest news