తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం

-

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు మరో అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వచ్చే నెల 16 నుంచి 20 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 2023 వార్షిక సదస్సుకు తెలంగాణ పరిశ్రమలు ఐటి శాఖల మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. సదస్సుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.

సదస్సుకు ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రిలు యోగి ఆదిత్యనాథ్, బసవరాజ్ బొమ్మై, ఏకనాథ్ షిండే, కేంద్ర మంత్రులు మాన్ సుక్ మాండవియా, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీలతో పాటు ముఖేష్ అంబానీ తదితర 100 మంది ప్రముఖులను ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానించింది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ప్రతి ఏటా ఈ సదస్సుకు కేటీఆర్ హాజరవుతున్నారు. వచ్చే నెల 14న ఆయన సదస్సు కోసం బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news