‘ఏంటో ఏంటేంటో’ అయిపోతుందంటున్న నాగచైతన్య..అసలేమైందో మరి!

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. ‘మనం’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య చేస్తున్న చిత్రం ఇది. కాగా, దీనిని దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రం నుంచి వరుసగా పాటలను మేకర్స్ విడుదల చేస్తున్నారు. వీడియోల్లో హీరో, హీరోయిన్స్ ఎక్స్ ప్రెషన్స్, లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ‘ఏంటో..ఏంటేంటో..నాలో ఏంటేంటో..’ అనే సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ కు సాహిత్యాన్ని ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ అందించారు. జోనిత గాంధీ ఆలపించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ కాగా, స్టోరిని బీవీఎస్ రవి అందించారు. వచ్చే నెల 8న ఈ పిక్చర్ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news