వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్…!

-

ఉదయం లేచింది మొదలు ఎవరి చేతిలో చూసిన మొబైల్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. ఒకప్పుడు ఫోన్లు కేవలం ఇద్దరూ వ్యక్తులు మాట్లాడుకోవడం కోసం మాత్రమే ఉండేవి. కానీ మొబైల్ ఫోన్లు వాడుకలోకి వచ్చిన తర్వాత మాటలు మాత్రమే కాదు మెసేజ్ లు మొదలు అయ్యాయి. నెమ్మదిగా వాట్సాప్ అందరికీ వాడుకలోకి వచ్చింది. వాట్సాప్ ఉపయోగించని వారు దాదాపు ఎవరు లేరని చెప్పాలి.

ఉదయాన్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ పలకరింపు తో మొదలై అర్దరాత్రి గుడ్ నైట్ మెసేజ్ చెప్పే వరకు అందరికీ వాట్సాప్ అవసరం పెరిగింది. ఎంతగానో ప్రజాదరణ పొందిన వాట్సాప్ ఎప్పటికప్పుడు అనేక ఆసక్తికరమైన ఫీచర్స్ ను యూజర్స్ కు అందించింది. ఇప్పుడు మళ్లీ త్వరలో ‘డిలిట్ మెసేజెస్’ ఫీచర్‌ని రిలీజ్ చేయబోతోంది. ఆ ఫీచర్‌కు ‘డిలిట్ మెసేజెస్’ అనే పేరు ఫైనలైజ్ చేసింది వాట్సప్.

ఆ ఫీచర్ విశేషాలు ఏమిటి అంటే సాధారణంగా వాట్సప్‌లో మనం పంపిన మెసేజ్‌ను ఎప్పుడైనా డిలిట్ చేయొచ్చు. మనం పంపిన మెసేజ్ చూడనప్పుడు మెసేజ్ డిలిట్ చేస్తే అందులో ఏం పంపించాం అనేది వారికి తెలియదు. ఒకవేళ మెసేజ్ అవతలి వారికి చేరాక చదివిన తర్వాత కూడా డిలిట్ చేసే అవకాశం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఫీచర్ లో మనం పంపిన మెసేజ్ ఎంత సేపట్లో డిలిట్ అవ్వాలో మనం ముందే నిర్ణయించే అవకాశం కల్పిస్తుంది ‘డిలిట్ మెసేజెస్’ ఫీచర్.

అది ఎలా అంటే ఒక గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక ఏడాది అని. ఇలా మనం నిర్ణీత సమయాన్ని ఈ ఫీచర్ ద్వారా సెట్ చేయడం జరుగుతుంది. మనం నిర్ణయించిన సమయానికి వాట్సప్‌లో ఆ మెసేజ్ ఆటోమేటిక్ గా డిలిట్ అవుతుంది. వాట్సప్‌లోని గ్రూప్స్‌లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది అని ప్రకటించినప్పటికి, ఇండివిజ్యువల్ ఛాట్స్‌లో కూడా ఈ ఫీచర్ రిలీజ్ చేయడానికి వాట్సప్ సిద్దం అయినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news