TSPSC పేపర్ లీకేజీ కేసు.. మరో ముగ్గురు అరెస్టు

-

టీఎస్​పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, రాజేశ్వర్‌ల కస్టడీ విచారణ ముగిసింది. మూడు రోజుల కస్టడీలో భాగంగా నలుగురిని విచారించిన పోలీసులు కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

 నలుగురు నిందితులకు నాంపల్లి కోర్టు ఏప్రిల్ 11 వరకూ 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించగా వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు కమిషన ఉద్యోగులైన షమీమ్‌, రమేష్, సురేష్ లను పోలీసులు 7రోజులు కస్టడీకి కోరగా.. కోర్టు వారిని 5రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని రేపు కస్టడీకి తీసుకుని హమాయత్ నగర్​లోని సిట్ కార్యాలయంలో విచారించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news