రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల జైలు శిక్ష.. ద.మ.రైల్వే వార్నింగ్

-

ఇటీవల కొందరు ఆకతాయిలు వందే భారత్ రైళ్లపై రాళ్లు విసిరి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. స్పందించడమే కాకుండా అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఆకతాయితనంతో రైళ్లపై రాళ్లు విసరడం వంటివి చేస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని స్పష్టం చేసింది. ఇటీవల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లపై రాళ్ల దాడులు జరిగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తీసుకున్న చర్యలపై మంగళవారం రోజున దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. భువనగిరి, కాజీపేట, ఖమ్మం, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో జనవరి నుంచి ఇప్పటివరకు ఇలాంటివి 9 ఘటనలు జరిగాయని, 39 మందిని అరెస్టుచేసి జైలుకు పంపామని పేర్కొంది. ఈ దాడుల్లో అయిదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news