బ్రేకింగ్: ఈటలతో పాటు మరో ఇద్దరు తెలంగాణ నాయకుల రాజీనామా..

ఈటల రాజేందర్ గారి రాజీనామాతో పాటు మరో ఇద్దరు తెలంగాణ నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మేల్యేగా పనిచేసిన ఏనుగు రవీందర్ రెడ్డి, ఇంకా తుల ఉమా కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
. గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

రాజీనామా అనంతరం ఈటల రాజేందర్, కేసీఆర్ పై అనేక విమర్శలు చేసారు. మంత్రి పదవిలో ఉండి కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, మూడు సార్లు ప్రగతి భవన్ కి వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అది ప్రగతి భవన్ కాదని, బానిసల నిలయం అని పేరు పెట్టుకోవాలని అన్నారు. కేసీఆర్ కేబినేట్ లో అందరూ బానిసలుగానే ఉండాలని, నాకే కాదు హరీష్ రావుకి కూడా అవమానాలు ఎదురయ్యారని అన్నారు. ఇదలా ఉంటే, రాజీనామా అనంతరం భవిష్యత్ కార్యచరణ ఎలా ఉంటుందనే విషయమై ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది.