అప్పుడు సంఘాలు కావాలి.. ఇప్పుడు వద్దా.. ఈటల.

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ సమ్మే విషయంలో కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు. చైతన్యాన్ని ఎదిరించడం కరెక్టు కాదని, అలా చేయడం వల్ల ఉద్యమం వస్తుందని చెప్పానని, అదేమైనా తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనికి వచ్చిన కార్మిక సంఘాలు, ఇప్పుడు పనికి రాకుండా పోయాయా అని అడిగారు.

ఇంకా, సీఎంవో ఆఫీసులో ఒక్క ఎస్సీ, ఎస్టీ ఆఫీసరు ఉన్నాడా అని కుల ప్రస్తావన తీసుకువచ్చారు. ఉద్యమంలో సహచరుడిగా ఉన్న నన్ను బానిసగా చూస్తుంటే ఎలా ఊరుకుంటాను? తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోరు. అణచివేతను నేను తట్టుకోలేదు. ఎవరో అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ జరుపుతారా అంటూ తన పట్ల కేసీఆర్ ఎలా ప్రవర్తించారో చెప్పుకువచ్చారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీలో చెలరేగిన ఈ కలకలం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.