వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం దాని ప్రకాశాన్ని కోల్పోతుంది. కొన్ని కొన్నిసార్లు చాలా నీరసంగా తయారై ఉన్నదాని కంటే ఎక్కువ వయసు ఉన్నవారిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు చర్మ సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. దానికి ఫేస్ ప్యాక్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇంట్లో ఉండి తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ వాడడం ఉత్తమం. అందులో బొప్పాయి ఫేస్ ప్యాక్ మీకు బాగా పనిచేస్తుంది. చర్మానికి సహజమైన మెరుపుని తీసుకురావడంలో, ఇంకా వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది.
ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
పండిన బొప్పాయిని తీసుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత గ్రైండర్ లో వేసుకుని బాగా చిక్కటి పదార్థం అయ్యేలాగా చేయండి. అపుడు ఆ చిక్కటి మిశ్రమాన్ని ముఖభాగం మీద, మెడభాగాల మీద వర్తించాలి. 15నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత సబ్బుతో శుభ్రంగా కడగండి. ఇలా వారానికి 2-3సార్లు చేస్తే సరిపోతుంది. దీనివల్ల చర్మం సహజంగా మెరిసే గుణాన్ని సంతరించుకుంటుంది.
వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి
బొప్పాయి పండుని కోసి 4-5ముక్కలను పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 2-3చెంచాల తేనె సిద్ధం చేసుకోండి. బొప్పాయి ముక్కలను గ్రైండర్ లో వేసుకుని పేస్టులాగా తయారయ్యాక దానికి తేనె కలుపుకుని, ముఖం, మెడభాగాల మీద వర్తించాలి. 20నిమిషాల తర్వాత సబ్బుతో శుభ్రంగా కడిగితే సరిపోతుంది. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉపయోగించవచ్చు. దీనివల్ల చర్మంపై ముడుతలు, గీతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.