చింత పండు.. అతిగా వాడితే అనర్థమే..!

-

చింతపండు పేరు చెబితే చాలు చాలా మంది నోటి వెంట లాలాజలం పొంగి వస్తుంటుంది. సాధారణంగా చింత పువ్వు, తొలకరి ఆకులు, పండ్లలలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది చింత చిగురు రసం, చింత పులుసు చేసుకుని తింటూ ఉంటారు. దీని వల్ల శరీరం చల్లబడుతుందని, వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుందని వారి నమ్మకం. ప్రతి ఒక్కరి ఇంట్లో చింతపండు ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆహార పదార్థాల తయారీలో చింతపండును వాడుతుంటారు. చింతపండులో ఖనిజాలు, యాంటిఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్, విటమిన్లు అధికంగా ఉంటారు. ఇవి శరీర పనితీరును మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చింత పండు
చింత పండు

మధుమేహ సమస్యతో బాధ పడేవారికి, ఊబకాయం ఉన్న వారికి చింతపండుతో చేసిన ఆహారాన్ని ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడో సమస్య ఉంది. చింతపండు అనేది మోతాదుకు మించి ఆహారంలో తీసుకుంటే ఎన్నో అనర్థాలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చింతపండులో హైపోగ్లైసీమిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులు చింతపండును వాడకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు. తరచూ చింతపండును తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు.

రక్తపోటుతో బాధ పడే వారు కూడా చింతపండు వాడకాన్ని తగ్గించాలి. అలాగే చింతపండు అధికంగా తినే వారికి తలవెంట్రుకలు తొందరగా తెల్లబడతాయి. వయసు కూడా ఎక్కువగా కనిపిస్తుందని, ఊబకాయ సమస్య ఏర్పడుతుందన్నారు. అలాగే బుద్ధి కూడా మందగిస్తుందని చెబుతున్నారు. తగిన మోతాదులో చింతపండును ఉపయోగించుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చింత చిగురుతో కొన్ని రకాలు పచ్చళ్లు కూడా చేసుకోవచ్చు. చింతపండును పులుసు పుల్లదనానికి ఉపయోగిస్తారు. వీటిని సాస్, పచ్చళ్లు, పానీయాల తయారీలో వాడుతారు. అలాగే రాగి పాత్రలు కడిగేందుకు ఎక్కువగా వీటిని వాడుతారు.

Read more RELATED
Recommended to you

Latest news