టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ కెరియర్ పూర్తిగా డేంజర్ జోన్ లో పడింది. గతంలో వరుస విజయాలు సాధించిన రవితేజ తరువాత వరుస ఫ్లాపులు రావటంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ సినిమా చేసి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు మళ్లీ ఫ్లాప్ అవటంతో తాజాగా రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన సరిగ్గా ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ఈ సినిమా నిర్మాత పూర్తిగా కష్టాల్లో మునిగిపోయినట్లు సినిమాకి పెట్టిన బడ్జెట్ కూడా రాకపోవడంతో.. దీంతో రవితేజ తో సినిమా అంటే నిర్మాతలకి పరుగులు పెట్టే పరిస్థితి ఏర్పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ‘డిస్కో రాజా’ నిర్మాత గతంలో రవితేజతో ‘నేల టికెట్’ అనే సినిమా తీయడం జరిగింది.
‘నేల టికెట్’ సినిమాకి కూడా పెట్టిన పెట్టుబడిలో కనీసం 30 శాతం కూడా రికవర్ చేయకపోవడంతో తాజాగా నిర్మించిన ‘డిస్కో రాజా’ కూడా ఫ్లాప్ అవడంతో కష్టాల్లో నిండా మునిగి పోయాడట నిర్మాత రామ్ తాళ్లూరి. దీంతో రవితేజతో సినిమా తీయాలంటే ఏ తెలుగు నిర్మాత కైన దమ్ము ఉండాలని రవితేజ మార్కెట్ పూర్తిగా కనుమరుగైన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.