అమరావతి రాజధాని రైతుల బహిరంగ సభకు ఏపీ హైకోర్ట్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తిరుపతిలో అమరావతి రైతుల సభకు ప్రభుత్వం నుంచి అనుమతి రాని వేళ రైతులు హైకోర్ట్ ను ఆదేశించగా తాజాగా సభకు అనుమతి ఇస్తూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు బహిరంగ సభకు అనుమతినిచ్చింది కోర్ట్. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించకుండా సభ నిర్వహించుకోవాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై ఎలాంటి కామెంట్లు చేయరాని షరతు విధించింది.
సభకు అనుమతినిచ్చే విషయంపై హైకోర్ట్ లో వాడీ వేడీ వాదనలు సాగాయి. అమరావతి రైతుల పాదయాత్రలో పోలీసులపై దాడి చేసారంటూ వీడియోలు చూపించిన ప్రభుత్వ ఏఏజీ పొన్నవోలు సుధాకర్. ఓమిక్రాన్ వేళ సభకు ఎలాంటి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించాడు. బహిరంగ సభ జరిగే ప్రదేశం తిరుపతి నుంచీ 6 కిలోమీటర్లు, ఎయిర్ పోర్టు నుంచీ 13 కిలోమీటర్లు అని తెలిపిన రైతుల తరఫు న్యాయవాది. రాజ్యాంగం హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై వాదనలు జరిగాయి. కాగా రైతుల తరుపున వాదనలతో ఏకీభవించిన కోర్ట్ సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభకు భద్రత కల్పించాల్పిన బాధ్యత పోలీసుదే అని హైకోర్ట్ తెలిపింది.